ఆంధ్ర ప్రదేశ్
AP Assembly: దుకాణాలు, సంస్థల సవరణ బిల్లు 2025కు ఆమోదం

AP Assembly: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆమోదం పొందిన దుకాణాలు, సంస్థల సవరణ బిల్లు 2025తో కార్మికులకు యజమానులకు మంచి జరగనుందని కార్మిక మంత్రి సుభాష్ తెలిపారు. రోజువారీ పని గంటలు 8 నుండి 10కి పెంచినా, వారానికి 48 గంటలకే పరిమితం చేయడం వల్ల కార్మికులకు వారంలో రెండు రోజుల విశ్రాంతి లభించనుందన్నారు.
ఓవర్‌టైమ్ గంటలు 150 నుండి 140కి తగ్గించగా, మహిళా కార్మికులకు రాత్రి 8 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు పని చేసే అవకాశం కల్పించారు. బిల్లు ఆమోదంపై కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.మంత్రి వాసం శెట్టి సుభాష్‌ను కార్మిక సంఘాలు, సచివాలయంలోని తన ఛాంబర్ లో కలిసి ధన్యవాదాలు తెలిపాయి. ముందస్తు నోటీసు లేకుండా ఉద్యోగం నుండి తొలగించకుండా కఠిన నిబంధనలు అమలు చేయడం ద్వారా కార్మికుల హక్కులు మరింత బలపర్చినట్లు మంత్రి సుభాష్ తెలిపారు



