ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: కుప్పం మున్సిపాలిటీ పరిధిలో సీఎం చంద్రబాబు పర్యటన

Chandrababu: కాసేపట్లో చిత్తూరు జిల్లా కుప్పంకు బయల్దేరనున్నారు సీఎం చంద్రబాబు. రెండ్రోజుల పాటు కుప్పంలోనే పర్యటించనున్నారు ఆయన. ఇంటింటికీ టీడీపీ ప్రచార కార్యక్రమంలో కూ డా పాల్గొననున్నారు సీఎం. రెండ్రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ శాంతిపురం మండలం కుప్పం మున్సిపాలిటీ పరిధిలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు.
మధ్యాహ్నం ఏపీ మోడల్ స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఇందులో భాగంగా పలు ప్రారంభోత్సవాలు, సంక్షేమ పథకాలు పంపిణీ చేయనున్నారు. బహిరంగ సభ తర్వాత తిమ్మరాజుపల్లెకు చేరుకోనున్నారు చంద్రబాబు. తిమ్మరాజుపల్లెలో ఇంటింటా ప్రజలతో మాటామంతీ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇక రాత్రి శివపురంలోని తన స్వగృహంలో చం ద్రబాబు బస చేయనున్నట్లు సమాచారం.