తెలంగాణ

online betting: మరో నిండు ప్రాణం బలితీసుకున్న ఆన్‌లైన్ బెట్టింగ్

online betting: ఆన్ లైన్ బెట్టింగ్‌కు మరో యువకుడు బలయ్యాడు. బెట్టింగ్‌లో నష్టపోయి ఆత్మహత్యకు యత్నించి చికిత్స పొందుతూ మృతి చెందాడు. నిజామాబాద్ రూరల్ మండలం ఆకుల కొండూరు గ్రామానికి చెందిన ఆకాశ్ కు భార్య, కుమారుడు ఉన్నారు.

వ్యవసాయం చేస్తూ జీవనం సాగించే ఆకాశ్ ఆన్ లైన్ బెట్టింగ్‌కు బానిసయ్యాడు. బెట్టింగ్‌లో 5 లక్షలు నష్టపోవడంతో. మార్చి 25న గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button