సినిమా
Ranya Rao Case: రన్యా రావు కేసులో మరో ట్విస్ట్.. తెలుగు నటుడు అరెస్ట్!

Ranya Rao Case: నటి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో మరో అరెస్ట్ జరిగింది. తెలుగు నటుడు తరుణ్‌రాజ్ కొండూరును అరెస్ట్ చేశారు. రన్యారావు వెనుక తరుణ్‌రాజ్ కింగ్‌పిన్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. 2019 నుంచి రన్యారావుతో తరుణ్‌రాజ్‌కు సంబంధాలు ఉన్నాయి.
దుబాయ్‌లో కస్టమ్స్ తనిఖీలను తప్పించుకునేందుకు.. యూఎస్ పాస్‌పోర్ట్ ఉపయోగించాడని DRI గుర్తించింది. యూఎస్ పాస్‌పోర్ట్ ఉపయోగించి బంగారం తరలించింది రన్యారావు. తరుణ్రాజ్తో కలిసి రన్యారావు పలుమార్లు దుబాయ్ వెళ్లింది. స్మగ్లింగ్ కేసులో తరుణ్‌రాజ్‌ను DRI టీమ్ విచారిస్తోంది.