సినిమా
రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాపై మరో క్రేజీ అప్డేట్?

Peddi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. తాజా అప్‌డేట్‌తో సినిమా హైప్ మరింత పెరిగింది.
రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘పెద్ది’ సినిమా షూటింగ్ జోరందుకుంది. ‘రంగస్థలం’ను మించే ఈ చిత్రంపై రామ్ చరణ్ ఎంతో ఆసక్తితో ఉన్నారు. మార్చిలో 30 శాతం పూర్తయిన షూటింగ్ ఇప్పుడు 55 శాతానికి చేరుకుంది.
ప్రస్తుతం కీలక సన్నివేశాలు చిత్రీకరణ జరుగుతోంది. ఏ ఆర్ రెహమాన్ సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. వృద్ధి సినిమాస్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం ఫ్యాన్స్‌లో ఉత్సాహం నింపుతోంది. యాక్షన్, ఎమోషన్‌తో కూడిన ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవనుందని అంటున్నారు.