Kalpika Ganesh: కల్పిక గణేష్‌పై మరో వివాదం.. సైబర్ కేసు నమోదు!

Kalpika Ganesh: టాలీవుడ్ నటి కల్పిక గణేష్‌పై మరో వివాదం చుట్టుముట్టింది. ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్య దూషణలతో వేధించినట్లు ఆరోపణలు. సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
నటి కల్పిక గణేష్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్య పదజాలంతో దూషించి, వేధింపులకు పాల్పడినట్లు కీర్తన అనే యువతి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కల్పిక స్టేటస్‌లు, ఇన్‌బాక్స్ మెసేజ్‌లలో వల్గర్‌గా మాట్లాడినట్లు ఆరోపించి, స్క్రీన్‌షాట్‌లను ఆధారంగా సమర్పించింది. దీంతో పోలీసులు 67 ITA 2000-2008, 79, 356 BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారగా, నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ప్రిజం పబ్‌లో గొడవ కేసులోనూ కల్పికపై ఫిర్యాదు నమోదైంది. వరుస వివాదాలతో కల్పిక కెరీర్‌పై ప్రభావం పడే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.