జాతియం
Air India: మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం

Air India: ఇటీవల ఎయిరిండియా విమానాల్లో వరుసగా సాంకేతిక లోపాలు నమోదవుతున్నాయి. తాజాగా మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో భారీ ముప్పు తప్పినట్టైంది. ఢిల్లీ నుంచి జమ్మూకు బయల్దేరిన ఎయిరిండియా విమానంలో టేకాఫ్ అయిన తర్వాత సాంకేతిక సమస్యను గుర్తించారు.
దీంతో జమ్మూ వెళ్లకుండానే ఢిల్లీకి తిరిగివచ్చింది ఎయిరిండియా విమానం. కాగా ఇటీవల ఎయిర్ ఇండియా విమానాలను వరుసగా సాంకేతిక సమస్యలు వెంటాడుతున్నాయి. జూన్ 12న అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదం అనంతరం, ఎయిర్ ఇండియా విమానాల భద్రతా పరిశీలనలపై DGCA పర్యవేక్షణను మరింత కఠినతరం చేసింది.