ఆంధ్ర ప్రదేశ్
Anitha: గంజాయిబ్యాచ్, క్రిమినల్స్‌కి జగన్ మద్దతిస్తున్నారు

Anitha: మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌పై హోంమంత్రి అనిత విరుచుకుపడ్డారు. నేరాలు చేసి జైల్లో ఉన్న వారిని జగన్ కలుస్తున్నారని విమర్శించారు. గంజాయి బ్యాచ్, క్రిమినల్స్‌కి జగన్ మద్దతిస్తున్నారని మండిపడ్డారు. మహిళలపై వైసీపీ నేతలు నీచంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
తీర్థయాత్రలు, జైత్రయాత్రలు, విజయయాత్రలు, దండయాత్రలు, ఓదార్పు యాత్రలు చూశాం ఇప్పుడు జగన్ జైలు యాత్రలు చూస్తున్నామని ఎద్దేవా చేశారు. పరామర్శల పేరుతో బల ప్రదర్శన చేస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు.