ఆంధ్ర ప్రదేశ్
కానిస్టేబుల్ కొర్లయ్యకు పరామర్శించి.. రాఖీ కట్టిన అనిత్

విశాఖలో రక్షా బంధన్ సందర్భంగా విధి నిర్వాహణలో ఉన్న పోలీసులకు హోమంత్రి అనిత రాఖీ కట్టారు. ఎంవీపీ నుండి ఉషోదయ జంక్షన్ వరకు హోమ్ మంత్రి అనిత ఆటోలో ప్రయాణించారు. ఆటో డ్రైవర్ యోగక్షేమాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు.
ఆటో డ్రైవర్ గిరీష్‌కు మంత్రి అనిత రాఖీ కట్టారు. అనారోగ్యంతో బాధపడుతున్న కానిస్టేబుల్ కొర్లయ్యకు పరామర్శించి అనిత రాఖీ కట్టారు. కానిస్టేబుల్ కొర్లయ్యకు మంత్రి ధైర్యం చెప్పారు. కానిస్టేబుల్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.



