ఆంధ్ర ప్రదేశ్
నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఉదయం 9 గంటలకు శాసనసభ, 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రశ్నోత్తరాలతో ప్రారంభమవుతాయి. అనంతరం స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరుగుతుంది. ఈ సందర్భంగా సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలో తుది నిర్ణయం తీసుకుంటారు.
ఏడు నుంచి పది రోజులు జరిపే అవకాశం ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 15 రోజులు జరిగాయి. శాసనసభ సమావేశాలకు వెళ్లే ముందు సీఎం చంద్రబాబు వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలదండలు వేసి నివాళులు అర్పిస్తారు. మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా హాజరవుతారు. ఈ కార్యక్రమం తర్వాత అసెంబ్లీకి పయనమవుతారు.



