తెలంగాణ
KCR: నేడు ఎర్రవల్లిలో బీఆర్ఎస్ నాయకులతో భేటీకానున్న కేసీఆర్

KCR: నేడు ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో మాజీ సీఎం కేసీఆర్‌తో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు భేటీ కానున్నారు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం కానున్నారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ నివేదికపై ప్రభుత్వం చర్చించనుంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చించేందుకు తమకు తగినంత సమయం ఇవ్వాలని బీఆర్ఎస్ కోరుతుంది.



