Andhra King Taluka: థియేటర్లను షేక్ చేస్తున్న ఆంధ్ర కింగ్!

Andhra King Taluka: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కథానాయకుడిగా నటించిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయింది. దర్శకుడు మహేశ్ బాబు పి తెరకెక్కించిన ఈ చిత్రం అద్భుత మౌత్ టాక్ సొంతం చేసుకుంది.
యంగ్ హీరో రామ్ పోతినేని నటించిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమా, థియేటర్లలో హంగామా సృష్టిస్తోంది. దర్శకుడు మహేశ్ బాబు పి ఈ చిత్రాన్ని ఒక అభిమాని కథగా ఆసక్తికరంగా తెరలించారు. విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ రివ్యూలు, బలమైన మౌత్ టాక్ ఈ సినిమాకు బంపర్ ఓపెనింగ్స్ అందించాయి. బుక్ మై షోలో భారీగా టికెట్లు బుక్ అవుతున్నాయి.
చాలా సెంటర్లలో హౌస్‌ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. రామ్ అద్భుత నటన, ఎనర్జిటిక్ పర్ఫామెన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. హీరోయిన్‌గా భాగ్యశ్రీ బొర్సె నటించగా, మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం అంచనాలను మించి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. వర్కింగ్ డేస్‌లోనూ ఈ జోష్ కొనసాగితే మరిన్ని రికార్డులు బద్దలు కావడం ఖాయమని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.



