సినిమా
అఖండ-2 ఆలస్యంతో లాభపడ్డ ఆంధ్రా కింగ్?

Akhanda 2: రామ్ ‘ఆంధ్రా కింగ్ తాలుకా’ సినిమాకు పోటీ లేకుండా పోయింది. బాలయ్య – బోయపాటి ‘అఖండ-2’ సినిమా ఆలస్యం కావడంతో ఈ చిత్రం ఆక్యుపెన్సీలు బాగా పెరిగాయి. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.
రామ్ నటించిన ఆంధ్రా కింగ్ తాలుకా సినిమా గత వారం విడుదలైంది. మొదటి రోజు నుంచే పాజిటివ్ స్పందన వచ్చినప్పటికీ బుకింగ్స్ పెద్దగా లేవు. అయితే ఇప్పుడు ఆక్యుపెన్సీలు మెరుగుపడ్డాయి. ఈ సీజన్‌లో పెద్ద సినిమాలు లేకపోవడంతో ఈ చిత్రానికి క్లీన్ రన్ లభించింది.
బోయపాటి శ్రీను – బాలకృష్ణ కాంబినేషన్‌లో రాబోతున్న ‘అఖండ-2’ చిత్రం రిలీజ్ వాయిదా కావడంతో ఆంధ్రా కింగ్ సినిమాకి బుకింగ్స్ పెరిగాయి. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం ఈ చిత్రం బ్రేక్ ఈవెన్‌కు చాలా దగ్గరలో ఉందని తెలుస్తుంది. మరి ఫైనల్ రన్ లో ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని సాధిస్తుందో చూడాలి.



