Anasuya: చెప్పు తెగుద్ది అంటూ మండిపడ్డ యాంకర్ అనసూయ!

Anasuya: జబర్దస్త్ యాంకర్ అనసూయ మరోసారి తనపై అసభ్య కామెంట్స్ చేసిన వారిపై గట్టిగా స్పందించారు. మార్కాపురంలో జరిగిన ఓ ఈవెంట్‌లో కొందరు యువకులు చేసిన వ్యాఖ్యలకు ఆమె ఎదురొడ్డి మాట్లాడారు. ప్రస్తుతం ఆమె స్పందన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్న యాంకర్ అనసూయ, ఆమెపై కొందరు యువకుల చేసిన కామెంట్లకు సమాధానమిచ్చారు. ఆమెను బూతులు తిడుతూ కామెంట్స్ చేసిన వారిని తీవ్రంగా ఖండించారు. “చెప్పు తెగుద్ది. మీ ఇంట్లో అమ్మ, చెల్లెలు ఉంటే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా? పెద్దవాళ్లకు గౌరవం ఇవ్వడం నేర్చుకోలేదా?” అంటూ ఆమె ప్రశ్నించారు. అనసూయ వీడియో, ఆమె స్పందన సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అనసూయకి ట్రోల్స్ కొత్తేమి కాదు. ఇదివరకు ఆమె విజయ్ దేవర కొండపై అనవసరంగా కామెంట్స్ చేసినందుకు ఆమెకు టార్చర్ చూపించారు నెటిజన్స్. ఆంటీ ఆంటీ అంటూ ఎంతగానో ఏడిపించారు. అప్పుడు ఆమె చేసిన తప్పుకు ఇప్పటిదాకా ట్రోల్స్ తప్పట్లేదు. అయినా కానీ ట్రోల్స్ కి భయపడకుండా వాటిని ఎదురుకుంటున్నారు. మరి ఆమెపై ఈ ట్రోలింగ్ ఎప్పుడు తగ్గుతుందో చూడాలి.