Anasuya Bharadwaj: బికినీ ఫొటోలతో మళ్ళీ రచ్చ చేసిన అనసూయ!

Anasuya Bharadwaj: యాంకర్ అనసూయ భరద్వాజ్ మరోసారి సోషల్ మీడియాను షేక్ చేశారు. బిగ్ బాస్ శివాజీ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన ఆమె హాట్ బికినీ ఫొటోలు పోస్ట్ చేశారు. ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నారు. బిగ్ బాస్ ఫేమ్ శివాజీ హీరోయిన్ల డ్రెస్సింగ్ పై చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో దుమారం రేపాయి. అనసూయ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మహిళల డ్రెస్సింగ్ పై అలా మాట్లాడటం తప్పని గట్టిగా వాదించారు. అయితే ఆమె స్పందనకు కొందరు నెటిజన్ల నుంచి ఎదురుదెబ్బ తగిలింది.
శివాజీకి మద్దతుగా నిలిచిన వారు అనసూయను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. ఆమె దుస్తులపై జాగ్రత్త వహించాలని సలహాలు ఇచ్చారు. అయినా అనసూయ వెనక్కి తగ్గలేదు. తనదైన శైలిలో విమర్శకులకు బదులిచ్చారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో భర్తతో కలిసి స్విమ్మింగ్ పూల్‌లో ఎంజాయ్ చేస్తున్న హాట్ బికినీ ఫొటోలు షేర్ చేశారు. ఈ ఫొటోలు ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.



