తెలంగాణ
సిద్దిపేట జిల్లాలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటన

Jishnu Dev Varma: సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటించారు. ఈ సందర్భంగా గౌరారంలోని కావేరి అగ్రికల్చర్ యూనివర్సిటీని గవర్నర్ సందర్శించారు. వర్సిటీకి వచ్చిన గవర్నర్‌కు వర్సిటీ అధికారులు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఏఐ, ఎంఎల్ ల్యాబ్, ఎంటమాలజీ లాబ్, సాయిల్ హెల్త్ లాబ్ లను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సందర్శించారు. డ్రోన్, రోబో టెక్నాలజీ ప్రదర్శనను గవర్నర్ తిలకించి అభినందించారు. సహజ వ్యవసాయం పరిశోధన, బయోలాజికల్ ప్రొడక్ట్స్ ల్యాబ్‌ను గవర్నర్ సందర్శించారు.



