జాతియం
Amit Shah: మహాకుంభమేళాలో అమిత్ షా.. త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు
Amit Shah: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. గంగా, యమున, సరస్వతీ నదులు కలిసే త్రివేణీ సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు. అనంతరం ఘాట్ వద్ద ప్రత్యేక పూజలు చేశారు.
అక్కడి అధికారులతో సమావేశాలు నిర్వహించి మహాకుంభ్ ఏర్పాట్లపై సమీక్షించారు. మరోవైపు షా పర్యటన నేపథ్యంలో నగరంలో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. కీలక కూడళ్లు, కార్యక్రమాల వేదికలపై నిఘా పెంచారు.