జాతియం

Amit Shah: రాజ్యాంగ సవరణపై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు

Amit Shah: భారత స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచీ ఇప్పటి వరకు చాలా మంది రాజకీయ నేతలూ, మంత్రులూ జైలుకు వెళ్ళి వచ్చిన వారు ఉన్నారు. అయితే వారికి బెయిల్ రాగానే మళ్లీ తమ పదవుల్లో కొనసాగుతారు. అయితే ఇక మీదట అలా చెల్లదు. ఎవరైనా పదవిలో ఉన్న నేత తీవ్ర నేరారోపణలతో జైలుకు వెళితే ప్రదా మంత్రి అయినా కేంద్ర మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా సరే తమ పదవికి రాజీనామా చేయాల్సిందే. అలా చేయకపోతే వారిని పదవి నుంచి తొలగిస్తారు. ఇదే ఇప్పుడు కొత్తగా వస్తున్న చట్టం. అయితే దీనిని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇంతకీ కాంగ్రెస్ దీన్ని వ్యతిరేకించడానికి కారణం ఏంటి..?

ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా జైలు నుంచే పరిపాలన చేయడం మంచి విషయమేనా..? అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశ్నించారు. మన ప్రజాస్వామ్యానికి అది మర్యాదపూర్వకంగా ఉంటుందా..? అంటూ విపక్షాలపై మండిపడ్డారు. విపక్షాలు ఇప్పటికీ కూడా జైలుకు వెళ్తే సులభంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేయగలమని అనుకుంటున్నారు.

వాళ్లు జైలునే సీఎం, పీఎం అధికారిక నివాసాలుగా మార్చేస్తారని మండిపడ్డారు. అప్పుడు డీజీపీ, చీఫ్‌ సెక్రటరీ, కేబినెట్‌ సెక్రటరీ వంటి ఉన్నతాధికారులు జైలు నుంచే ఆదేశాలు తీసుకోవాల్సి ఉంటుందని ఎద్దెవా చేశారు. ఇలాంటి సిద్ధాంతాలను తాను, తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. జైలు నుంచే ప్రభుత్వాలను నడిపే పరిస్థితి మన దేశంలో రాకూడదని అమిత్ షా అన్నారు.

ప్రధాని గానీ ముఖ్యమంత్రి గానీ లేదా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న ఏ నేత అయినా సరే ఏదైనా కేసులో అరెస్టయితే 30 రోజుల్లో బెయిల్‌ పొందాలి. లేదంటే తమతమ పదవులకు రాజీనామా చేయాలి. అలా చేయకపోతే చట్టమే వారిని తప్పించేలా 130వ రాజ్యాంగ సవరణను తీసుకొస్తున్నాం. చట్టమేదైనా ప్రభుత్వం, ప్రతిపక్షానికి ఒకేలా అమలవుతుంది. ఈ నిబంధన ప్రధాని పదవికి కూడా వర్తించేలా స్వయంగా నరేంద్రమోదీనే దీన్ని సవరణలో చేర్చారు. ఆయనకు కూడా ఇది వర్తిస్తుంది.

ప్రధాని జైలుకెళ్తే ఆయనైనా రాజీనామా చేయాల్సిందేనని అమిత్ షా అన్నారు. ఎన్నికైన ప్రభుత్వం రాజ్యాంగ సవరణను తీసుకొస్తే దానిపై అభ్యంతరాలు లేవనెత్తే హక్కు అందరికీ ఉంటుంది. అంతేగానీ, పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు కూడా అవకాశం లేకుండా ఆందోళనలు చేస్తే ఎలా..? అని మండిపడ్డారు. ఈ బిల్లు కచ్చితంగా పార్లమెంట్‌లో ఆమోదం పొందుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు.

130వ రాజ్యాంగ సవరణ బిల్లుపై విపక్షాల ఆరోపణలను అమిత్‌ షా తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా 2013 నాటి ఉదంతాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీపై ధ్వజమెత్తారు. రాజ్యాంగ సవరణ బిల్లులో నైతికత లేదని విపక్షాలు అంటున్నాయి. నాడు లాలూ యాదవ్‌ను కాపాడేందుకు అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ పత్రాలను రాహుల్‌ గాంధీ చింపేశారు.

ఆ రోజే ఆయన నైతికతతో వ్యవహరిస్తే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నారు. ఈ రాజ్యాంగ సవరణపై కాంగ్రెస్‌ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందని విమర్శించారు. వరుస వైఫల్యాలతో ఆ పార్టీ ఆలోచనావిధానం మందగించి ఉంటుందని కేంద్రమంత్రి ఎద్దేవా చేశారు.

గతంలో ఇందిరాగాంధీ 39వ సవరణను ప్రవేశపెట్టిన విషయాన్ని షా గుర్తు చేశారు. ఈ సందర్భంగా విపక్ష పార్టీలపై అమిత్‌ షా తీవ్ర స్థాయిలో మండపిడ్డారు. ప్రభుత్వం రాజ్యాంగ సవరణను తీసుకొస్తే దానిపై అభ్యంతరాలు వ్యక్తం చేసే హక్కు అందరికీ ఉందని వ్యాఖ్యానించారు. అయితే, అలాంటి బిల్లులను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు కూడా అవకాశం లేకుండా ఆందోళనలు చేస్తే ఎలా..? అంటూ మండిపడ్డారు.

ఈ సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ రాజీనామా అంశాన్నీ ఆయన ప్రస్తావించారు. ధన్‌ఖడ్‌జీ రాజ్యాంగ పదవిలో కొనసాగారు. ఆయన పదవీకాలంలో ఎన్నో మంచి పనులు చేశారు. వ్యక్తిగత అనారోగ్య సమస్యల కారణంగా ఇప్పుడు రాజీనామా చేశారు. ఈ విషయాన్ని మరీ ఎక్కువగా లాగొద్దు. కేవలం ప్రతిపక్షాల ఆరోపణల ఆధారంగా దీనిపై ఓ అంచనాకు రావడం సరికాదని అమిత్ షా స్పష్టం చేశారు.

త్వరలో జరగబోయే ఉపరాష్ట్రపతి ఎన్నిక గురించి ప్రస్తావిస్తూ రాష్ట్రపతిని తూర్పు భారతం నుంచి ఎన్నుకున్నామని ఇప్పుడు ఉపరాష్ట్రపతి దక్షిణాది నుంచి ఉండాలని అనుకున్నామని అన్నారు. దీనికి, తమిళనాడు ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకుని రాబోతున్న చట్టంలో ప్రధానుల నుంచి మంత్రుల దకా అంతా ఉన్నారని ఆయన గుర్తు చేశారు. ఎవరు తప్పు చేసినా చట్ట ప్రకారం పదవులు పోతాయని మోడీ స్పష్టం చేశారు. అందరికీ ఒకే న్యాయం అన్నారు. అవినీతి ఎక్కడా ఉండరాదు అన్నది విధానం అని చెప్పారు. అందుకే 130 రాజ్యాంగ సవరణకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పూనుకుందని ఆయన చెప్పారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక నిబద్ధతతో కూడుకున్న విధానం అనుసరిస్తోంది అని చెప్పారు.

ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులు జైలుకు వెళ్ళగానే కేవలం యాభై గంటలలోనే వారి ఉద్యోగం ఆటోమేటిక్ గానే పోతుందని మోడీ చెప్పుకొచ్చారు. అలాంటిది అవినీతి చేసి జైలుకు వెళ్ళి అక్కడ నుంచి పాలిస్తామంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు. పదవులకు రాజీనామాలు చేయమంటే ఏ మాత్రం సహించేది లేదని అన్నారు.

ప్రభుత్వాలను జైలు నుంచి ఎందుకు నడపాలని మోడీ నిలదీశారు. అయితే ఈ బిల్లు లోక్ సభలో ఆమోదం పొందుతుందో లేదో తెలియదు. ఎందుకంటే దీనిపై కాంగ్రెస్ అభ్యంతరాలు చెబుతోంది. ప్రతిపక్షాలు పాలించే రాష్ట్రాల ముఖ్యమంత్రులను తొలగించేందుకు ఈ బిల్లును ప్రవేశపెడుతున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.

ప్రధాని పదవికి కూడా ఈ నిబంధన వర్తిస్తుందని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే సూచించారు. అంటే, ఒకవేళ మోదీ గారు కూడా జైలుకెళ్తే ఆయన కూడా రాజీనామా చేయాల్సిందే. చట్టం అనేది ప్రభుత్వం, ప్రతిపక్షం అనే తేడా లేకుండా అందరికీ సమానంగా వర్తిస్తుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button