క్రీడలు
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అమెరికా అమెరికా క్రికెటర్లు

తిరుమల శ్రీవారిని అమెరికా క్రికెటర్లు దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో యూఎస్‌ఏ జట్టులోని భారత సంతతికి చెందిన ఆటగాళ్లు మొనాంక్ పటేల్, మిలింద్ కుమార్, సౌరభ్ నేత్రావల్కర్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన క్రికెటర్లు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు.
దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత బాగుందని కెప్టెన్ మొనాంక్ పటేల్ కొనియాడారు.



