తెలంగాణ
Amberpet SI Arrest: అంబర్పేట్ ఎస్సై భాను ప్రకాష్ రెడ్డి అరెస్ట్

హైదరాబాద్ అంబర్పేట్ ఎస్సై భాను ప్రకాష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెట్టింగ్ అప్పులు తీర్చేందుకు స్టేషన్లో రికవరీ చేసిన సొత్తును తాకట్టు పెట్టినట్లు విచారణలో తేలడంతో.. అధికారులను ఆయనను అరెస్ట్ చేసి చంచల్గూడ జైలుకు తరలించారు. తన సర్వీస్ రివాల్వర్ రైలులో ప్రయాణిస్తుండగా పొగొటుకున్నట్లు భాను ప్రకాష్ స్టేట్మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.



