తెలంగాణ
హైదరాబాద్ ఆర్టీసీ కళాభవన్లో అంబేద్కర్ జయంతి వేడుకలు

హైదరాబాద్ ఆర్టీసీ కళాభవన్లో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ స్ఫూర్తితో ఆర్టీసీలో వినూత్న కార్యక్రమాలను ప్రవేశపెడుతున్నట్లు టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. కులం, మతం, లింగ బేధం లేకుండా ప్రజలందరీకి సమాన అవకాశాలుండాలని అంబేద్కర్ పోరాడారని ఆయన కొనియాడారు.
అంబేద్కర్ ఆశయాలు ముందు తరాలకు స్ఫూర్తి దాయకమన్నారు. ఆర్టీసీలో ఉద్యోగుల పెండింగ్ అంశాలను యాజమాన్యం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిందన్నారు. కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఉద్యోగులు నమ్మొద్దని ఆయన సూచించారు.