ఆంధ్ర ప్రదేశ్
పార్లమెంట్‌లో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లు

పార్లమెంట్‌లో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లు కేంద్రం ప్రవేశపెట్టింది. లోక్‌సభలో అమరావతికి శాశ్వత చట్టబద్ధత కల్పించడానికి ఈ బిల్లును తీసుకువచ్చారు. కేంద్రహోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ బిల్లును ప్రతిపాదించారు. రాజధానిగా అమరావతికి చట్టబద్ధత ఇచ్చే అంశం పై పార్లమెంట్‌లో చర్చలు జరుగుతున్నాయి. ఈ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది.



