ఆంధ్ర ప్రదేశ్
Amalapuram: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అమలాపురం తహసీల్దార్

Amalapuram: ఓ రైతు నుంచి 50 వేలు లంచం తీసుకుంటుండగా ఓ తహసీల్దార్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఈ ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో చోటుచేసుకుంది. గంధం దుర్గా కొండలరావు అనే రైతుకు చెందిన భూమిని ఆన్‌లైన్ చేసేందుకు తహసీల్దార్ అశోక్, మరియు ఆపరేటర్ రాము లంచం డిమాండ్ చేశాడు.
ఈ క్రమంలోనే ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు రైతు. తాజాగా వారికి లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఈ నేపథ్యంలోనే తహసీల్దార్ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. దీంతో ఐదు లక్షల నగదును స్వాధీనం చేసుకున్న అధికారులు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.



