Allu Arjun: షాకిస్తున్న అల్లు అర్జున్-అట్లీ సినిమా కథ?

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ సినిమా చేయనున్నట్లు సినీ వర్గాలు ధృవీకరించాయి. ఈ చిత్రం గురించి సోషల్ మీడియాలో రోజుకో వార్త వైరల్ అవుతోంది.
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా నేపథ్యం పునర్జన్మల చుట్టూ తిరుగుతుందని, అందుకే అల్లు అర్జున్ ఈ చిత్రంలో రెండు పాత్రల్లో కనిపించనున్నాడని తెలుస్తోంది. టాలీవుడ్‌లో గతంలో వచ్చిన ‘మగధీర’, ‘మనం’ వంటి చిత్రాల కథలను పోలి ఈ సినిమా ఉంటుందని అంటున్నారు.
ఈ ప్రాజెక్ట్‌ను ఇప్పటికే ఖరారు చేసినట్లు, త్వరలో అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. ఈ సినిమాతో అల్లు అర్జున్ మరోసారి తన నటనా ప్రతిభను చాటనున్నాడని అభిమానులు ఆశిస్తున్నారు. అట్లీ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం కథ, నేపథ్యం గురించి వస్తున్న వార్తలు సినీ ప్రియుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.