సినిమా
Allu Arjun: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా..

Allu Arjun: అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై నాంపల్లి కోర్టు విచారణను వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేసేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమయం కోరడంతో విచారణను ఈ నెల 30 కి వాయిదా వేసింది.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఇటీవల అల్లు అర్జున్ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హజరుపర్చగా, నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అదే సమయంలో తెలంగాణ హైకోర్టులో మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆయన జైలు నుంచి విడుదల అయ్యారు.