అఖిల్ అక్కినేని పెళ్లి సందడి?

Akhil Akkineni: అక్కినేని అఖిల్ పెళ్లి వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. జైనబ్‌తో వివాహానికి డేట్ ఫిక్స్ అయినట్లు సమాచారం. అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అక్కినేని కుటుంబంలో సందడి మొదలైంది! యంగ్ హీరో అఖిల్ అక్కినేని త్వరలో జైనబ్ రవ్జీని వివాహం చేసుకోనున్నారు. సమాచారం ప్రకారం, జూన్ 6న ఈ గ్రాండ్ వెడ్డింగ్ జరగనుంది. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు, అఖిల్ నటిస్తున్న ‘లెనిన్’ సినిమా షూటింగ్ జోరందుకుంది.
రాయలసీమ నేపథ్యంలో మురళి కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. భారీ సెట్లలో క్లైమాక్స్ సన్నివేశాలు చిత్రీకరణ జరుగుతున్నాయి. అఖిల్ స్పెషల్ స్టంట్స్, డైలాగ్ డెలివరీతో థియేటర్లలో విజిల్స్ కొట్టించేలా ఉంటాయని టాక్. ఈ ఏడాది నవంబర్‌లో ‘లెనిన్’ రిలీజ్ కానుంది. అక్కినేని అభిమానులకు ఈ రెండు శుభవార్తలు ఆనందం పంచుతున్నాయి.