సినిమా

Lenin: లెనిన్ విడుదల ఎప్పుడంటే?

Lenin: అక్కినేని యంగ్ హీరో అఖిల్ మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు. రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ కొత్త చిత్రం గురించి లేటెస్ట్ అప్‌డేట్స్ ఇప్పుడు చూద్దాం.

అక్కినేని అఖిల్ తన తాజా చిత్రంతో రాయలసీమ రచ్చ చేయడానికి సిద్ధమవుతున్నాడు. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి రూపొందిస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్తూరు యాసలో అఖిల్‌ను కొత్త అవతారంలో చూపించనుంది. అన్నపూర్ణ స్టూడియోలో భారీ సెట్‌లో స్పెషల్ సాంగ్ షూటింగ్ జరుగుతోంది. ఈ సాంగ్ తర్వాత హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరించనున్నారు.

ప్రత్యేక సెట్స్‌తో ఈ యాక్షన్ సన్నివేశాలు కనువిందు చేయనున్నాయి. హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తుండగా, సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దసరా సీజన్‌లో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం అఖిల్ కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. మరి, ఈ మాస్ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేస్తుందో చూడాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button