సినిమా

Akkada Ammayi Ikkada Abbayi: ఆకట్టుకుంటున్న ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ ట్రైలర్

Akkada Ammayi Ikkada Abbayi: యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ ఇప్పటికే సినీ అభిమానుల్లో భారీ బజ్ క్రియేట్ చేసింది. గతంలో పవన్ కళ్యాణ్ నటించిన సూపర్ హిట్ చిత్రం టైటిల్‌తోనే ఈ సినిమా రావడం విశేషం. ఈ సినిమాలో హీరోయిన్‌గా దీపికా పిల్లి నటిస్తుండగా, ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, సాంగ్స్, టీజర్లు ప్రేక్షకుల్లో అంచనాలను రెట్టింపు చేశాయి. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

ట్రైలర్ చూస్తే ఇది పక్కా కామెడీ ఎంటర్‌టైనర్ అని ఒక్కసారిగా అర్థమవుతుంది. ఓ గ్రామానికి ఇంజినీర్‌గా వచ్చిన హీరో అక్కడి పరిస్థితులు, ప్రజల వల్ల ఎలాంటి సమస్యల్లో చిక్కుకుంటాడనేది కథాంశంగా కనిపిస్తోంది. కామెడీ ఈ సినిమాకు ప్రధాన హైలైట్ కాబోతోందని ట్రైలర్ చూస్తే స్పష్టంగా తెలుస్తుంది. ప్రదీప్ మాచిరాజు తనదైన టైమింగ్‌తో నవ్విస్తుండగా, కమెడియన్ సత్య తన పంచ్‌లతో పొట్ట చెక్కలయ్యేలా చేస్తున్నాడు.

హీరోయిన్ దీపికా పిల్లి కూడా తన అందంతో ఆకట్టుకుంటోంది.ఈ చిత్రాన్ని నితిన్-భరత్ దర్శకత్వంలో తెరకెక్కిస్తుండగా, సంగీత దర్శకుడు రధన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సాంగ్స్‌తో మ్యాజిక్ చేశాడు. మాంక్స్ అండ్ మంకీస్ బ్యానర్‌పై ఈ సినిమా నిర్మితమవుతోంది. ఏప్రిల్ 11న ఈ చిత్రం గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. మొత్తంగా ఈ సినిమా కామెడీ ప్రియులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజీ కాబోతోందని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button