సినిమా

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్!

Akkada Ammayi Ikkada Abbayi: బుల్లితెర నుంచి వెండితెరకు అడుగుపెట్టిన ప్రదీప్ హీరోగా నటించిన రెండో చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. స్మాల్ స్క్రీన్ నటి దీపికా పిల్లి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను ‘ఢీ’ షో దర్శకులు నితిన్, భరత్‌లు తెరకెక్కించారు. థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమైంది.

తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఈటీవీ విన్ ఈ సినిమా హక్కులను సొంతం చేసుకుంది. మే 8 నుంచి ఈ చిత్రం ఈటీవీ విన్‌లో అందుబాటులోకి రానుందని ఈటీవీ విన్ వారు అధికారికంగా ప్రకటించారు. థియేటర్లలో మిస్ అయిన సినీ ప్రేమికులు ఇప్పుడు ఈటీవీ విన్‌లో ఈ సినిమాను వీక్షించే అవకాశం దక్కింది.

ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందనేది ఆసక్తికరం. ఇంకెన్ని రోజుల్లోనే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది కాబట్టి, అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button