అఖండ 2: మొదటి రోజు రికార్డు వసూళ్లు!

Akhanda 2: నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 – తాండవం చిత్రం డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన లభిస్తోంది. మొదటి రోజు ప్రీమియర్లతో కలిపి వరల్డ్‌వైడ్‌గా రూ.59.5 కోట్ల గ్రాస్ సాధించింది. ఈ విజయంతో బాలయ్య అభిమానులు ఉత్సాహంలో ఉన్నారు.
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ 2 – తాండవం చిత్రం భారీ అంచనాల మధ్య డిసెంబర్ 12న వరల్డ్‌వైడ్ గ్రాండ్ రిలీజ్ అయింది. మాస్ స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని చూడటానికి థియేటర్ల వద్ద ప్రేక్షకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బాలకృష్ణ విశ్వరూప ప్రదర్శనకు థమన్ థ్రిల్లింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ జోడించడంతో థియేటర్లలో జోష్ నిండిపోయింది. ప్రీమియర్ షోలకు కూడా సూపర్ రెస్పాన్స్ లభించింది.
చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించినట్లు మొదటి రోజు ప్రీమియర్లతో కలిపి వరల్డ్‌వైడ్‌గా రూ.59.5 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ విజయంతో బాలయ్య బాక్సాఫీస్ వద్ద రుద్రతాండవం చేస్తున్నాడని అభిమానులు సంబరపడుతున్నారు. సంయుక్త హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మాతలుగా వ్యవహరించారు.



