Akhanda 2: బాలయ్య అఖండ తాండవం.. ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్!

Akhanda 2: నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన భారీ చిత్రం ‘అఖండ 2: తాండవం’ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలయ్య డ్యూయల్ రోల్‌లో కనిపించిన ఈ సినిమా యాక్షన్, ఎమోషన్‌లతో సాగుతుంది. బాలయ్య అభిమానులకు ఈ చిత్రం పూనకలు తెప్పిస్తుంది.
భారీ అంచనాల మధ్య ‘అఖండ 2: తాండవం’ థియేటర్లలో రిలీజ్ అయింది. నందమూరి బాలకృష్ణ డ్యూయల్ రోల్‌లో నటించిన ఈ చిత్రాన్ని బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. బాలయ్య పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
ముఖ్యంగా అఘోరా పాత్రలో ఆయన ఎలివేషన్ సన్నివేశాలు, స్లో మోషన్ షాట్లు ఫ్యాన్స్‌కు కిక్కు ఇస్తాయి. విలన్‌గా ఆది పినిశెట్టి ఆకట్టుకున్నాడు. బాలయ్య-ఆది మధ్య యాక్షన్ సీక్వెన్సులు హైలైట్‌గా నిలుస్తాయి. సంయుక్త మీనన్ గ్లామర్ పాత్రలో కనిపించగా, ఎమోషనల్ సన్నివేశాల్లో మెప్పించింది. హర్షాలీ మల్హోత్రా కీలక పాత్రలో బాగా నటించింది.
మాస్ డైలాగ్స్, భారీ విజువల్స్, వైల్డ్ యాక్షన్‌లతో సినిమా బాలయ్య అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇస్తుంది. అయితే కథలో లోతు ఉన్నప్పటికీ మెయిన్ కాన్‌ఫ్లిక్ట్ సరిగా ఎస్టాబ్లిష్ కాలేదు. కొన్ని సన్నివేశాలు అతిగా సినిమాటిక్‌గా అనిపిస్తాయి. మొత్తంమీద బాలయ్య ఫ్యాన్స్‌కు ఈ చిత్రం నచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.



