Akhanda 2: మైండ్ బ్లాక్ చేస్తున్న అఖండ 2 మాసివ్ టీజర్!

Akhanda 2: నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న అఖండ 2 సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విడుదలైన మాసివ్ టీజర్ అయితే ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తోంది.
నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా సంయుక్త మీనన్ హీరోయిన్‌గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న అఖండ 2 సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు అద్భుత స్పందన లభించింది.ఇక తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వచ్చిన కొత్త టీజర్ మాత్రం ఫ్యాన్స్‌ను ఉరకలు పెట్టిస్తోంది.
బోయపాటి మార్క్ భారీ యాక్షన్ సీక్వెన్సులు, బాలకృష్ణ మాస్ ఎంట్రీలు, డైలాగ్ డెలివరీ ట్రైలర్‌ను మరింత ఆకర్షణీయం చేశాయి. థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రంతో ఫ్యాన్స్ ఉత్సాహం రెట్టింపు అయింది.



