సినిమా

అఖండ 2: బాలీవుడ్‌లో భారీ ప్రమోషన్స్‌

Akhanda 2: నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబోలో రూపొందుతున్న ‘అఖండ 2’ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టేందుకు సిద్ధమైంది. టీజర్‌తో అభిమానుల్లో హైప్ పీక్స్‌కు చేరింది. పాన్ ఇండియా రిలీజ్‌తో ఈ చిత్రం భారీ విజయం సాధించనుంది.

‘అఖండ 2’తో నందమూరి బాలకృష్ణ మరోసారి మాస్ జాతర సృష్టించేందుకు రెడీ. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం టీజర్‌తోనే అంచనాలను ఆకాశానికి తాకించింది. శివతత్త్వం, యాక్షన్, ఎమోషనల్ డ్రామాతో పాటు బోయపాటి మార్క్ మాస్ ఎలిమెంట్స్‌తో సినిమా హైలైట్‌గా నిలవనుంది. ఆది పినిశెట్టి విలన్‌గా, సంయుక్త మీనన్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరో ఆకర్షణ. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 25న దసరా కానుకగా విడుదల కానుంది. బాలీవుడ్‌లోనూ భారీ ప్రమోషన్స్‌తో మేకర్స్ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button