సినిమా

Akhanda 2: వరుసగా 100 కోట్ల సినిమాలు.. అఖండ 2తో బాలయ్య నయా రికార్డ్!

Akhanda 2: నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో మరో మైలురాయి నమోదైంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ నెగటివ్ టాక్ వచ్చినా కూడా 2 భారీ ఓపెనింగ్స్ సాధించింది. డీసెంట్ రన్‌తో సక్సెస్‌ఫుల్ గా వారం పూర్తి చేసుకుంది. ఈ చిత్రం కూడా 100 కోట్ల గ్రాస్ దాటనుంది. దీని గురించి పూర్తి వివరాలు చూద్దాం. నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ 2 తాండవం మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ చిత్రం బాలయ్య కెరీర్‌లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా నిలిచింది. విడుదలైన తర్వాత డీసెంట్ కలెక్షన్స్‌తో కొనసాగుతూ సక్సెస్‌ఫుల్ మొదటి వారం పూర్తి చేసుకుంది. టాలీవుడ్ ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా కూడా 100 కోట్ల గ్రాస్‌ను సాధించింది. గతంలో వచ్చిన అఖండ నుంచి ప్రారంభమై అఖండ 2 వరకు బాలకృష్ణ నటించిన ప్రతి చిత్రం కూడా 100 కోట్ల గ్రాస్ దాటడం విశేషం. ఇది బాలయ్య కెరీర్‌లో అరుదైన రికార్డుగా నిలుస్తుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button