తెలంగాణ

Delhi Ari Pollution: దీపావళి ఎఫెక్ట్‌.. రెడ్‌జోన్‌లో ఢిల్లీ కాలుష్యం

Delhi Ari Pollution: ఢిల్లీలో కాలుష్యం రెడ్ జోన్‌ను తాకింది. దీపావళి వేడుకల అనంతరం వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఇవాళ ఉదయం 7 గంటల సమయానికి గాలి నాణ్యత సూచీ 347 పాయింట్లకు పెరిగింది. వెరీ పూర్ కేటగిరిలో గాలి నాణ్యత కొనసాగుతోంది. ఇది చాలా ప్రమాదకరమని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి పేర్కొంది. కాలుష్యం పెరగడంతో ప్రజలు కళ్లు, ముక్కు, గొంతులో మంట, దురద సమస్యలు తలెత్తుతున్నాయి. మాస్క్ ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు.

గత ఏడాది దీపావళి మరుసటి రోజు ఉదయం నమోదైన 296 ఏక్యూఐతో పోలిస్తే ఈసారి కాలుష్యం మరింత పెరిగింది. నిన్న సాయంత్రం 4 గంటలకే ఢిల్లీలో ఏక్యూఐ 345గా ‘వెరీ పూర్’ కేటగిరీలో నమోదైంది. బాణాసంచా మోతతో రాత్రికి రాత్రే గాలి నాణ్యత మరింత క్షీణించింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button