Vishnupriya: విష్ణుప్రియని నిందితురాలుగా తెల్చేసిన పోలీసులు

Vishnupriya: బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ ప్రస్తుతం వణికిస్తున్నాయి. అయితే ఈ కేసులో పలువురు పేర్లు బయటకి రాగా విష్ణుప్రియను కీలక నిందితురాలిగా పోలీసులు గుర్తించారు. 15 బెట్టింగ్ యాప్స్ సంస్థల నిందితులతో ఆమెకు లింకులు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
నిందితురాలిగా తేలిన విష్ణుప్రియ మొబైల్ ను పోలీసులు సీజ్ చేశారు. విష్ణుప్రియ సూచనల మేరకే తన ఫ్రెండ్ రీతూ చౌదరి కూడా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోషన్ చేసినట్లు వెలుగుచూసింది. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసే విధంగా విష్ణుప్రియ సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టింగ్లు పెట్టడం, ఆ యాప్ డబ్బులు పెట్టి సంపాదించవచ్చని డైరెక్ట్ గా చాలా మందిని బెట్టింగ్ వైపుకు మళ్లించడం జరిగింది.
అయితే మొదట విష్ణు ప్రియా మంగళవారం విచారణకు హాజరుకాలేదు. ఈ విషయాన్నీ తీవ్రంగా పరిగణించిన పోలీసులు తప్పని సరిగా విచారణకు రావాలని చెప్పడంతో విష్ణుప్రియ పోలీసుల ముందు హాజరైంది. రెండు గంటల 40 నిమిషాల పాటు విష్ణు ప్రియను విచారించారు పోలీసులు. విష్ణు ప్రియ స్టేట్మెంట్ ను రికార్డు చేసారు. ఇక ఆమెకు చట్టం ఎలాంటి శిక్ష విధిస్తుందో చూడాలి.