AI: రోబో సినిమాను గుర్తు చేస్తున్న ఏఐ.. అలా వాడితే డేంజర్..

AI: రోబో సినిమాలో హీరో తయారు చేసిన రోబో ఎన్నో మంచి పనులకు ఉపయోగపడుతుంది. కానీ… చివరకు అదే రోబో ఎంతో మంది ప్రాణాలు తీస్తుంది. అచ్చం అలాంటి సంఘటనలే నేటి సమాజంలోనూ జరుగుతున్నాయి. రెండు వైపులా పదునున్న కత్తిలాంటి రోబోలతో… ప్రయోజనమెంతో, కీడూ అంతే జరుగుతుంది. అబద్ధాలు చెప్పడం, ఎత్తుగడలు వేయడం, తమ లక్ష్యాలను సాధించుకోవడం కోసం తమ క్రియేటర్లను సైతం బెదిరించడం వంటి వాటికి పాల్పడుతున్నాయి. దీంతో… మరోసారి రోబోలు అంటేనే జనం భయపడుతున్నారు. ఇంతకీ రోబో ఏం చేసింది..? ఎవరిని..? ఎందుకు బెదిరించింది… ?
ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ చూసిన ఏఐ.. ఏఐ.. ఏఐ.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్.. ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు క్రియేట్ చేస్తోంది. రోజుకో విధంగా అభివృద్ది చెందుతోంది. ఏఐ మోడల్స్ రోజురోజుకు పవర్‌ఫుల్‌గా తయారువుతున్నాయి. మనుషులు గంటలు, రోజులు, నెలలు చేసే పనిని.. ఏఐ చిటికెలో చేసి పడేస్తోంది. యూట్యూబ్‌లో వీడియో క్రియేషన్ నుంచి పెద్దపెద్ద కంపెనీల వరకు ఏఐని ఏదో ఓ రకంగా గట్టిగనే వాడుతున్నారు.
అయితే ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాన్నాయనే వార్తలు ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్నాయి. చాట్ జీపీటీ, పాలీ, వైస్ లీ, పాప్ ఏఐ, లుమా ఏఐ, ట్రికిల్, డూరబుల్, 3డీ డైలీ, గీతా జీపీటీగ వంటి ఏఐ టూల్స్ యువత, పలు సంస్థలు ఎక్కువగా వాడుతున్నాయి. అయితే ఏఐతో ఉద్యోగాల పోవడం కంటే దాని వల్ల జరిగే దుర్వినియోగం చాలా ప్రమాదకరమని నిపుణులు అంటున్నారు.
ఆంథ్రోపిక్ కొత్తగా అభివృద్ధి చేసిన క్లాడ్ 4 తనను అన్‌ప్లగ్ చేస్తారనే భయంతో ఓ ఇంజినీరును బ్లాక్‌మెయిల్ చేసింది ఏఐ. వివాహేతర సంబంధం గురించి బయటపెడతానని హెచ్చరించింది. చాట్‌జీపీటీని తయారు చేసిన ఓపెన్‌ఏఐకి చెందిన ఓ1 తనను తాను ఎక్స్‌టర్నల్ సర్వర్స్‌పైకి డౌన్‌లోడ్ చేసుకునేందుకు ప్రయత్నించింది. అది రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన తర్వాత తాను అలాంటి ప్రయత్నం చేయలేదని అబద్ధం చెప్పింది.
ఏఐలో ఇటువంటి ప్రవర్తనను ఓ1లోనే మొట్టమొదట గమనించినట్లు అపోలో రిసెర్చ్ హెడ్ మారియస్ హొబ్బహ్న్ తెలిపారు. ఏఐ మోడళ్లను అర్థం చేసుకోవడం, వాటి భద్రతా ప్రమాణాలను పరీక్షించడం కన్నా అత్యంత వేగంగా వాటి సామర్థ్యాలు పెరిగిపోతున్నాయన్నారు. అయితే, ఇప్పటికీ సమయం మించిపోలేదని చెప్పారు. మేజర్ ఏఐ సిస్టమ్స్‌ను పరీక్షించడంలో అపోలో రిసెర్చ్‌కు ప్రత్యేకత ఉంది.
ఇటువంటి మోడల్స్ కొన్నిసార్లు ఆజ్ఞలను పాటిస్తున్నట్లుగా కనిపిస్తూ అదే సమయంలో రహస్యంగా వేరొక లక్ష్యాలను నెరవేర్చుకుంటూ ఉంటాయి. దీనినే వ్యూహాత్మక మోసం అంటారు. ఇప్పటి వరకు ఈ డిసెప్టివ్ బిహేవియర్ కేవలం పరిశోధకులు ఉద్దేశపూర్వకంగా విపరీతంగా ఒత్తిడి పెట్టి వీటిని పరీక్షించేటపుడు కనిపిస్తున్నది.
తమకు ఏఐ మోడల్స్ అబద్ధాలు చెప్తున్నాయని, సాక్ష్యాలను సృష్టిస్తున్నాయని యూజర్లు చెప్పినట్లు అపోలో రిసెర్చ్ కో-ఫౌండర్ చెప్పారు. పరిశోధనకు వనరులు పరిమితంగా ఉండటం మరొక పెద్ద సవాలు అని నిపుణులు చెప్తున్నారు. ఆంథ్రోపిక్, ఓపెన్‌ఐఏ వంటి కంపెనీలు తమ సిస్టమ్స్‌ను అపోలో వంటి ఇతర కంపెనీల ద్వారా అధ్యయనం చేయిస్తున్నాయి. అయితే మరింత పారదర్శకత అవసరమని పరిశోధకులు చెప్తున్నారు.
అంతేకాదు రజినీకాంత్ హీరోగా గతంలో రోబో అనే సినిమా వచ్చింది. అయితే ఆ సినిమాలో మంచి కోసం రజినీకాంత్ అచ్చం తన రూపంలో ఉండే ఒక హ్యూమనాయిడ్ రోబోను తయారు చేస్తారు. ఆ రోబో మంచి పనులు చేస్తుంది. కానీ విలన్ అందులోని సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయడంతో మనిషి లాగా ఉన్న ఆ రోబో ఒక్కసారిగా నరరూప రాక్షసుడిగా మారిపోయి. మనుషుల ప్రాణాలు తీస్తుంది. ఈ క్రమంలోనే జరిగిన ఓ సంఘటన మళ్లీ అలాంటి ఘటనను గుర్తు చేసింది.
చైనాలో ఏర్పాటు చేసిన ఓ రోబో ఎగ్జిబిషన్‌లో ఆర్టిఫిషియల్ రోబో అక్కడికి వచ్చిన సందర్శకులను తీవ్ర భయకంపితులను చేసింది. ఆ ఎగ్జిబిషన్‌కు వచ్చిన వారిపైకి ఒక్కసారిగా దూసుకెళ్లి దాడి చేయబోయింది. దీంతో అక్కడ ఉన్న వారంతా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వెంటనే అది గమనించిన అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది ఆ రోబోను అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది.
మరోవైపు ఏఐ ప్రతి రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది. టెక్ ప్రపంచంలో అయితే సంచలనాలే సృష్టిస్తోంది. అయితే ఏఐ వల్ల ఉద్యోగాలు కోల్పోవడం కంటే దాని దుర్వినియోగమే మోస్ట్ డేంజర్. మనుషుల ఉద్యోగాలు పోతాయనే ఆందోళన కంటే ఈ ఏఐ చెడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తేనే డెంజర్ అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఏఐని చెడుకు ఎక్కువగా వాడితే ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అలాంటి వాటికి వీటి యాక్సెస్ ఇవ్వకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
అలాగే పవర్ ఫుల్ ఏఐని ఉపయోగించి అద్భుతమైన పనులను సజావుగా నిర్వహించవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో వైట్ కాలర్ ఉద్యోగాలు పోయే ప్రమాదముంది. సాధారణ పనులను ఏఐ చేయడంతో.. మనుషులు మరింత ముఖ్యమైన పనులపై ఇంట్రెస్ట్ పెట్టొచ్చని చెప్పారు. అలాంటప్పుడు మరింత స్కిల్ తో కూడిన ఉద్యోగ అవకాశాలు వస్తాయని అన్నారు.
ఏఐ ను బ్యాడ్ గా వాడేవారిని గుర్తుపట్టి తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రస్తుతం భౌగోళిక, రాజకీయ, ఉద్రిక్తతలు ఉన్నప్పటకీ ఏఐ పవర్, వాడకం పెరిగే కొద్ది దాని దుర్వినియోగం ఆపేందుకు ప్రపంచ వ్యాప్తంగా సహకారం అవసరమని చెప్పారు.
ఏఐ మోడల్స్ పని తీరును అంతర్గతంగా అర్థం చేసుకోవడంపై దృష్టి సారించాలని పరిశోధకులు సలహా ఇస్తున్నారు. వీటిని విక్రయించేవారు కూడా ఈ సమస్యలకు పరిష్కారాల కోసం ఒత్తిడి తెచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏఐ మోడల్స్ హాని కలిగించినపుడు, నేరాలకు పాల్పడినపుడు వాటిని తయారు చేసిన కంపెనీలను జవాబుదారీ చేయాలని, దీని కోసం న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశాలు ఉండాలని మరికొందరు సలహా ఇస్తున్నారు.
అలాగే ఒక పెళ్లి జరగాలంటే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలని మన పెద్దలు అనేవారు. కానీ కాలం మారుతున్న కొద్దీ ఎన్నో మార్పులొచ్చాయి. ప్రేమ పెళ్లిళ్లు, మతాంతర వివాహాలు కూడా జరుగుతున్నాయి. స్వలింగ వివాహాలు అనే ట్రెండ్ కూడా జరుగుతోంది. కానీ ఇప్పుడు ఏకంగా మర మనుషులను కల్పిత పాత్రలను పెళ్లి చేసుకోవడమనే హైటెక్ పెళ్లిళ్లు మొదలవుతున్నాయి. ఈ టెక్నాలజీ పెళ్లిళ్లు ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీస్తున్నాయి. మనిషి టెక్నాలజీకి బానిస అవ్వడమేనంటున్నారు. ప్రపంచాన్ని వేగంగా చుట్టేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఉద్యోగాలకే కాదు.
మన మనిషి మనుగడుకూ ముప్పు అంటున్నారు. చాట్‌జీపీటీ ప్రారంభించిన కొన్ని నెలల్లోనే ప్రపంచాన్ని చుట్టేసింది. యూజర్ల సందేహాలకు కచ్చితమైన ఆన్సర్స్ ఇస్తున్న క్రమంలో ఎక్కువ మంది దీన్ని వినియోగిస్తున్నారు. ఇప్పుడు టెక్ కంపెనీలన్నీ ఏఐ టెక్నాలజీ అభివృద్ధిలో నిమగ్నమయ్యాయి. ఈ క్రమంలోనే జీపీటీ ఆధారిత ఏఐ బాట్‌లనే స్నేహితులుగా జీవిత భాగస్వాములుగా సపోర్టర్లుగా ఊహించుకుంటుండటం ఆందోళన రేకెత్తిస్తోంది.
కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెండు వైపులా పదునున్న కత్తిలాంటింది. దీనితో ప్రయోజనమెంతో, కీడూ అంతే జరుగుతున్నది. ఏఐ మోడల్స్ తీరుపై ఇప్పుడు సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. అబద్ధాలు చెప్పడం, ఎత్తుగడలు వేయడం, తమ లక్ష్యాలను సాధించుకోవడం కోసం తమ క్రియేటర్లను సైతం బెదిరించడం వంటి వాటికి పాల్పడుతున్నాయి.
మొత్తానికి ఏఐని ముఖ్యమని పనులకే వాడాలని ప్రముఖ నిపుణులు చెబుతున్నారు. ఏఐని దుర్వినియోగానికి వాడితే అది మనుషులకు ప్రమాదమని అంటున్నారు. వీలైనంత వరకు వర్క్ విషయంలోనే ఏఐని వాడాలి. ఏఐని అతిగా వాడిన అనర్ధాలు ఎదుర్కోవాల్సి వస్తోందని చెబుతున్నారు. రోబో సినిమా వలే చిట్టిని అభివృద్ధి కోసం క్రియేట్ చేస్తే అది దుర్వినియోగం అయిందని ఏఐని కూడా అలా చేయకూడదని ప్రముఖులు సూచిస్తున్నారు.