బిగ్ బాస్ 19: ఏఐ తారతో సరికొత్త హంగామా!

Bigg Boss 19: బిగ్ బాస్ 19 సీజన్ సంచలనంగా మొదలవబోతోంది! సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వస్తున్న ఈ సీజన్‌లో ఓ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కంటెస్టెంట్ సందడి చేయనుంది. ఈ కొత్త ట్విస్ట్‌తో షోపై ఆసక్తి రెట్టింపు అవుతుంది.
భారత టెలివిజన్‌లో సంచలన రియాలిటీ షో బిగ్ బాస్ మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. హిందీలో 18 సీజన్‌లు పూర్తి చేసుకున్న ఈ షో, ఇప్పుడు 19వ సీజన్‌తో కొత్త ఉత్సాహాన్ని తెస్తోంది. ఈసారి ప్రత్యేక ఆకర్షణగా ఏఐ ఆధారిత కంటెస్టెంట్ ‘హబుబు’ రాబోతోంది.
యూఏఈ నుంచి వచ్చిన ఈ రోబోట్ డాల్, ఏడు భాషల్లో మాట్లాడగలదు, వంట చేయగలదు, శుభ్రం చేయగలదు. అరబ్ స్టైల్ వేషధారణలో హబుబు హౌస్‌లో ఎలాంటి సందడి చేస్తుందో ఆసక్తికరంగా మారింది. సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా కొనసాగుతున్న ఈ సీజన్, ఆగస్టులో ప్రారంభం కానుంది. ఈ కొత్త ట్విస్ట్ రియాలిటీ షో ఫార్మాట్‌ను ఎలా మారుస్తుందో చూడాలి.