తెలంగాణ
Hyderabad: అఫ్జల్‌గంజ్ కాల్పుల కేసులో పురోగతి
Hyderabad: అఫ్జల్‌గంజ్ కాల్పుల కేసులో పురోగతి సాధించారు పోలీసులు. తిరుమలగిరి నుంచి ఆటోలో షామీర్‌పేట్‌కు దుండగులు వెళ్లినట్లు గుర్తించారు. షామీర్‌పేట్ నుంచి గజ్వేల్ వరకు షేరింగ్ ఆటోలో… అక్కడి నుంచి ఆదిలాబాద్‌కు లారీలో ప్రయాణించారు.
ఆదిలాబాద్ నుంచి మధ్యప్రదేశ్ మీదుగా బీహార్‌కు వెళ్లారు. కాల్పులకు పాల్పడింది అమిత్, మనీష్‌గా పోలీసులు గుర్తించారు. బీదర్, హైదరాబాద్ పోలీసులు జాయింగ్ ఆపరేషన్ చేపట్టారు. బీహార్‌తో పాటు జార్ఖండ్‌లో పోలీసులు గాలిస్తున్నారు.