అంతర్జాతీయం
Afghanistan Earthquake: శిథిలాల దిబ్బగా అఫ్గానిస్థాన్

Afghanistan Earthquake: అఫ్గనిస్థాన్ శిథిలాల దిబ్బగా మారింది. రిక్టర్ స్కేల్‌పై 6.0 తీవ్రతతో నమోదైన భూకంపం ఆ దేశానికి కాళరాత్రిని మిగిల్చింది. ఏకంగా 800 మందికి పైగా ప్రాణాలను బలిగొంది. 2 వేల 500 మందిని క్షతగాత్రులను చేసింది. భూకంప తాకిడికి గ్రామాలకు గ్రామాలే ధ్వంసమయ్యాయి.
శిథిలాల కింద చిక్కుకున్న ఆప్తులను రక్షించుకొనేందుకు చేతులతోనే చాలా మంది మట్టిని తవ్వితీస్తున్న దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. తాలిబన్ ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. వేల సంఖ్యలో ప్రజలు ఇంకా శిథిలాల కిందే చిక్కుకొని ఉంటారని అనుమానిస్తున్నారు.



