సినిమా

Aditi Rao Hydari: అదితి రావ్ హైదరీ హెచ్చరిక.. ఫేక్ మెసేజ్‌లు నమ్మొద్దు!

Aditi Rao Hydari: అదితి రావ్ హైదరీ పేరుతో ఫేక్ మెసేజ్‌లు పంపుతూ ఫ్రాడ్ చేస్తున్న వ్యక్తి గురించి ఆమె హెచ్చరించారు. ఫొటోషూట్స్ కోసం డబ్బులు దండుకుంటున్నాడని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ అయింది.

ప్రముఖుల పేరుతో ఫేక్ ఐడీలు వాడి ఫ్రాడ్‌లు పెరిగిపోతున్నాయి. తాజాగా నటి అదితి రావ్ హైదరీకి ఇలాంటి సమస్య ఎదురైంది. ఆమె ఫోటో ఉన్న వాట్సాప్ నంబర్‌తో ఫొటోగ్రాఫర్లకు మెసేజ్‌లు పంపుతూ డబ్బులు దండుకుంటున్నాడు ఓ వ్యక్తి. ఈ విషయం అదితి దృష్టికి వచ్చింది. వెంటనే స్పందించిన ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తన పేరుతో ఫొటోషూట్స్ కోసం మెసేజ్‌లు పంపుతున్న వ్యక్తి తాను కాదని స్పష్టం చేశారు. ఫోన్ నంబర్లు ఎవరికీ ఇవ్వలేదని, స్పెషల్ టీమ్ ద్వారానే సంప్రదిస్తానని తెలిపారు.

ఇకమీదట నా పేరుతో కాంటాక్ట్ అయితే తమకు తెలియజేయాలని కోరారు. ఇటీవల అనుపమ పరమేశ్వరన్ కూడా ఇలాంటి ఫ్రాడ్‌కు గురయ్యారు. ఫేక్ రాయుళ్ల గోల పెరిగిపోవడంతో సెలబ్రిటీలు అప్రమత్తం చేస్తున్నారు. అదితి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫొటోగ్రాఫర్లు, అభిమానులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button