తెలంగాణ
అసెంబ్లీ ముట్టడికి ఆదిలాబాద్ భూ నిర్వాసితులు

ప్రాజెక్టుల కింద నష్టపోయిన భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి అని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడి జరిగింది. ఆదిలాబాద్ భూ నిర్వాసితులు చేసిన ముట్టడికి ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మద్దతు తెలిపారు. పాయల్ శంకర్ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న రైతులను బషీర్ బాగ్ నిజాం కాలేజ్ హాస్టల్ ముందు పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో పాటు రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు.



