తెలంగాణ
ఏసీబీ వలలో హన్మకొండ జిల్లా అదనపు కలెక్టర్

ఏసీబీ వలలో హన్మకొండ జిల్లా అదనపు కలెక్టర్ చిక్కుకున్నారు. 60 వేలు లంచం తీసుకుంటూ హన్మకొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. హన్మకొండ జిల్లా ఇన్‌ఛార్జ్ డీఈవోగానూ అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న వెంకటరెడ్డి ప్రైవేట్ స్కూల్ రెన్యువల్‌కు లంచం డిమాండ్ చేశారు. లంచం తీసుకుంటుండగా వెంకటరెడ్డితో పాటు జూనియర్ అసిస్టెంట్ మనోజ్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.



