తెలంగాణ
Addanki Dayakar: కేటీఆర్‌కు దమ్ముంటే ప్రెస్ క్లబ్ కు కాదు.. అసెంబ్లీకి రావాలి

Addanki Dayakar: కేటీఆర్ కు దమ్ముంటే ప్రెస్ క్లబ్ కు కాదు అసెంబ్లీకి రావాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సవాల్ విసిరారు. ప్రజల సమస్యలపై ఎన్నిరోజులైనా అసెంబ్లీలో చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. వారి కుటుంబంలో ఆధిపత్యం కోసమే కేటీఆర్ ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.
గత పదేళ్లలో అసెంబ్లీలో ఏ పార్టీకి ఎన్ని గంటలు అవకాశం ఇచ్చారో కేటీఆర్‌కు తెలియదా అని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి కేటీఆర్‌కు లేదని అంటున్న అద్దంకి దయాకర్.