తెలంగాణ
Addanki Dayakar: మీరు మాట్లాడితే రాజకీయం..ఇతరులు మాట్లాడితే బూతులా

Addanki Dayakar: మాజీ మంత్రి జగదీష్‌రెడ్డిపై ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఫైరయ్యారు. బూతులు మాట్లాడటంలో బీఆర్ఎస్‌ను మించిన నాయకులు ఎవరు లేరని ఆయన విమర్శించారు. బూతులు మాట్లాడటంలో కేసీఆర్ ప్రపంచంలో బ్రాండ్ అంబాసిడర్ అన్నారని అన్నారు.
మీరు మాట్లాడితే రాజకీయం ఇతరులు మాట్లాడితే బూతులా అని ఆయన ప్రశ్నించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా మీద సీఎం రేవంత్‌రెడ్డి ఒక ప్రణాళిక ఉందన్నారు. ఇరిగేషన్, సివిల్ సప్లై మంత్రిగా ఉత్తమ్ కుమార్ నల్గొండ జిల్లా కోసం నిరంతరం శ్రమిస్తున్నామన్నారు.