తెలంగాణ
Addanki Dayakar: బీజేపీ నాయకులకు మెదడు మోకాళ్లలో ఉంది

Addanki Dayakar: బీజేపీ నేత NVSS ప్రభాకర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఫైరయ్యారు. బీజేపీ నాయకులకు మెదడు మోకాళ్లలో ఉందని విమర్శించారు. బీజేపీ వాళ్ల బుద్ధిలో మార్పు రావడం లేదన్నారు. బీఆర్ఎస్లో కాంగ్రెస్ ఎందుకు విలీనం అవుతుందని ప్రశ్నించారు.
బీజేపీ, బీఆర్ఎస్ డీఎన్ఏ ఒక్కటేనని అన్నారు. అందుకే బీజేపీ రాష్ట్రంలో జనాలు తొక్కి పెట్టారని అద్దంకి దయాకర్ అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎప్పటికి కలవదన్నారు. బీజేపీతో బీఆర్ఎస్కు చీకటి ఒప్పందం ఉందని అద్దంకి దయాకర్ ఆరోపించారు.