సినిమా

సినీ రంగానికి వీడ్కోలు పలికిన నటి తులసి!

Actress Tulasi: ప్రముఖ సినీ నటి తులసి నటనకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ ఏడాది డిసెంబర్ 31 నుంచి షిర్డీలో సాయిబాబా సేవలో జీవితాన్ని గడపనున్నారు. నాలుగేళ్ల వయసు నుంచి సినీ ప్రస్థానం ప్రారంభించిన తులసి మూడు వందలకు పైగా చిత్రాల్లో నటించారు.

సినీ నటి తులసి యాక్టింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ ఏడాది డిసెంబర్ 31న షిర్డీ సాయిబాబా ఆలయానికి వెళ్లి మిగతా జీవితాన్ని ఆయన సేవకు అంకితం చేస్తానని తులసి తేల్చి చెప్పారు. నాలుగేళ్ల వయసు నుంచే కెమెరా ముందు నటన ప్రారంభించిన తులసి తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సుమారు 300కిపైగా చిత్రాల్లో నటించారు.

1980లో వచ్చిన శంకరాభరణం సినిమాలో బాలనటిగా నటించి మంచి గుర్తింపు పొందారు. తర్వాత యువ హీరోలకు తల్లిగా, సోదరిగా, ఇతర కీలక పాత్రల్లో నటించి ప్రేక్షకుల మనసుల్ని ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఆమె నటనకు వీడ్కోలు పలకడం అభిమానులను కలచివేస్తోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button