Shazahn Padamsee: ఘనంగా పెళ్లి చేసుకున్న రామ్ చరణ్ హీరోయిన్!

Shazahn Padamsee: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన ‘ఆరెంజ్’ సినిమాలో నటించిన షాజన్ పదమ్సీ పెళ్లి పీటలెక్కారు. ముంబైలో జరిగిన ఈ వివాహ వేడుకలు మూడు రోజుల పాటు సందడిగా జరిగాయి. ఆమె పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
తెలుగు సినిమా ‘ఆరెంజ్’లో రామ్ చరణ్ సరసన హీరోయిన్‌గా మెరిసిన షాజన్ పదమ్సీ ముంబైలో ఘనంగా వివాహం చేసుకున్నారు. ఆమె ఎంచుకున్న వరుడు ఎవరో కాదు. అతను మూవీ మాక్స్ సీఈఓ ఆశిష్ కనకియా. ఈ జంట చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు. ఓ స్నేహితుడి ద్వారా పరిచయమైన ఈ జంట, సుదీర్ఘ డేటింగ్ తర్వాత కుటుంబ సమ్మతితో ఒక్కటయ్యారు.
ముంబైలో మూడు రోజుల పాటు జరిగిన వివాహ వేడుకలు అందరినీ ఆకట్టుకున్నాయి. ‘ఆరెంజ్’ తర్వాత షాజన్ తెలుగులో ‘మసాలా’ సినిమాలోనూ నటించారు. అయితే, తెలుగులో అంతగా సక్సెస్ కాలేక బాలీవుడ్‌కు వెళ్లి అక్కడ కొన్ని చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం వీరి వివాహ వేడుకల ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.