Sai Pallavi: స్టార్ హీరో సినిమా నుంచి తప్పుకున్న సాయి పల్లవి!

Sai Pallavi: న్యాచురల్ బ్యూటి సాయి పల్లవి ప్రస్తుతం వరుస హిట్ లతో దూసుకుపోతుంది. ఇక ఈ అమ్మడు సినిమాల ఎంపిక విషయంలో ఎంత క్లారిటిగా ఉంటుందో అందరికి తెలిసిందే.ఆమె ఒక సినిమా ఒప్పుకుంటే కచ్చితంగా ఆ మూవీలో ఎదో బలమైన కథ ఉందని ఫ్యాన్స్ నమ్ముతారు. సాయి పల్లవి ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంటే ఆ సినిమా సగం సూపర్ హిట్ అయిపోయినట్టే అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోతారు. ఇలాంటి పాజిటివ్ వైబ్రేషన్స్ రప్పించగల ఈ హీరోయిన్ తాజాగా ఓ స్టార్ సినిమా నుండి తప్పుకుందట. ఇంతకీ ఆ సినిమా ఏంటో చూద్దాం.
‘బలగం’ మూవీతో దర్శకుడిగా తన సత్తా చాటాడు కమెడియన్ వేణు. పక్కా ఎమోషనల్ కథగా ఈ సినిమా ప్రేక్షకులను కట్టిపడేసింది. తాజాగా తన నెక్స్ట్ చిత్రం ‘ఎల్లమ్మ’ తెరకెక్కించేందుకు ఈ డైరెక్టర్ సిద్ధమవుతున్నాడు.ఈ సినిమాలో నితిన్ హీరోగా నటించబోతున్నట్లు కన్ఫర్మ్ కాగా. ఈ మూవీలో హీరోయిన్గా సాయి పల్లవి నటించబోతున్నట్లు, కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.
కానీ, ఇప్పుడు పరిస్థితులు మారినట్లు తెలుస్తోంది. ‘ఎల్లమ్మ’ మూవీ షూటింగ్‌ను ఈ ఏడాది చివరినాటికి ప్రారంభించాలని మేకర్స్ భావిస్తుంటే చివరి నిమిషంలో సాయి పల్లవి డేట్స్ కుదరడం లేదని ఈ సినిమాకు ఆమె నో చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.దీంతో మేకర్స్ సాయి పల్లవి ప్లేస్‌లో మరో హీరోయిన్ కోసం వెతుకుతున్నారట.