Ranjitha: నిత్యానంద కైలాస దేశానికి ప్రధానిగా మాజీ నటి రంజిత

Ranjitha: మనదేశంలో ప్రజలకు దేవుళ్ళు అన్నా, దేవుళ్ళకు సంబందించిన ఏదైనా కూడా ఇట్లే నమ్మేస్తుంటారు.. అందుకే వీధికో గుడి దర్శనమిస్తుంది. ఈ నమ్మకాన్నే కొందరు క్యాష్ చేసుకుంటున్నారు. అది అడ్డు పెట్టుకొని కొందరు దొంగ బాబాలు విచ్చల విడిగా డబ్బులను సంపాదిస్తున్నారు. మరికొందరు భక్తి ముసుగులో అక్రమాలకు, దారుణాలకు ఒడిగడుతున్నారు. అలాంటి వారి లిస్ట్‌లో నిత్యానంద స్వామీ పేరు మొదటగా వినిపిస్తుంది.
అయితే ఇప్పుడు ఆయన ప్రియశిష్యులురాలు ఓ దేశానికే ప్రధాని అయ్యారట. తెలుగులో ఒకట్రెండు సినిమాల్లో నటించిన ఆ కన్నడ నటి ఓ దేశ ప్రధాని అవ్వడం అందరిని అయోమయంలో పడేసింది. అయితే.. ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. ఆమెను ఎన్నుకొని ప్రధానిని చేయలేదు ఆమెను వివాదాల్లోకి లాగిన ఆమె గురువు ప్రసాదించిన పదవి అంట ఇదంతా.. ఇంతకీ ఎవరా నటి…? ఏ దేశానికి ఆమె ప్రధాని అయ్యారు..?
వివాదాస్పద గురువు నిత్యానంద గుర్తున్నారా..? హిందూ ధర్మానికి వారధిగా చెప్పుకుంటూ దేశ, విదేశీ భక్తులను సంపాదించుకుని ఓ వెలుగు వెలిగారు. ఆ తర్వాత భారత్‌లో కిడ్నాప్, అత్యాచారం వంటి పలు కేసులు ఆయనపై నమోదు అయ్యాయి. అత్యాచార ఆరోపణలు తీవ్రం కావడంతో… 2019లో దేశం విడిచి పారిపోయారు. ఆ తర్వాత ఓ ద్వీపంలో ప్రత్యక్షం అయ్యారు.
దానికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస అనే పేరు పెట్టారు. ఆయనే ఓ దేశంగా ప్రకటించుకున్నారు. ఈ దేశానికి ప్రత్యేక కరెన్సీతో పాటు ప్రభుత్వ పాలనను ఏర్పాటు చేశారు. అటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస దేశానికి పౌరసత్వం కూడా జారీ చేస్తున్నారు. 2022 మే నెలలో తాను చనిపోయినట్టు వస్తున్న వార్తలను ఖండిస్తూ తాను సమాధి లో ఉన్నానని, తనకేం కాలేదని ప్రకటించాడు.
అయితే తాజాగా ఈయన మరోసారి వార్తల్లో నిలిచారు. ఆ దేశానికి తన ప్రియ శిష్యురాలైన మాజీ నటి రంజితను ప్రధానమంత్రిగా ప్రకటించుకున్నట్లు ఓ ప్రముఖ తమిళ పత్రిక వెల్లడించింది. ఈ మేరకు నిత్యానంద వెబ్‌సైట్‌లోనూ ప్రకటించారని పేర్కొనడం కలకలం రేపుతోంది. ఆ వెబ్‌సైట్‌లో రంజిత చిత్రం దిగువన నిత్యానందమయి స్వామి అనే పేరుందని, దాని దిగువనే హిందువుల కోసమే ఏర్పాటైన కైలాసదేశ ప్రధానిగా పేర్కొని ఉందని వివరించింది.
నిత్యానంద వెబ్ సైట్ లో నిత్యానంద రంజిత ఫొటోలు మాత్రమే ఉన్నాయి.ఇటీవల ఐక్యరాజ్యసమితి సమావేశంలో కైలాస దేశం తరఫున మహిళా రాయబారులు పాల్గొన్నారు. ఆ కోవలోనే నటి రంజిత కూడా కైలాస దేశ ప్రధానిగా త్వరలోనే ఐక్యరాజ్యసమితి సమావేశానికి హాజరైనా ఆశ్చర్యం లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఈ వివాదాస్పద ఆధ్యాత్మిక గురువురుకు సంబంధించిన రాసలీలల వీడియో 2010లో వెలుగులోకి రావడంతో దేశంలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఒకప్పటి హీరోయిన్ రంజితతో ఆయన ఏకాంతంగా కలిసున్న దృశ్యాలు అప్పటిలో ఎంతగా వైరల్ అయ్యాయో చూసే ఉన్నాం దీంతో ఆయన పరువు రోడ్డున పడింది. దీంతో తాను అసలు మగాడ్నే కాదంటూ కోర్టు మెట్లక్కారు.
అయినా ఎవ్వరు నమ్మలేదు. ఆయనకు పురుషత్వ పరీక్షలు నిర్వహించడం, ఆయన మగాడే అంటూ పరీక్షల్లో బయటపడటం ఇదంతా చరిత్ర. అయితే అప్పటి నుంచి స్వామికి ఏదోక వివాదం తెర లేపుతుంది అత్యాచారం, కిడ్నాప్ లాంటి కేసులు ఎదుర్కొంటూ 2019లో దేశం విడిచి పారిపోయాడు.
రంజిత ఒకప్పుడు సౌత్ తో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె 1992లో నాదోడి థెండ్రల్ తమిళ సినిమాతో రంగప్రవేశం చేసింది. కొంతకాలానికే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తమిళం పాటు తెలుగు, మలయాళం, కన్నడ సినిమాల్లో అగ్ర హీరోలతో కలిసి నటించింది. 1996లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన మావిచిగురు సినిమాకు ఉత్తమ సహాయనటిగా నంది అవార్డు అందుకుంది. సినిమా కేరీర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకుంది. సౌత్ సినిమా పరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది.
ఆమె సినీ కెరీర్ మంచి ఫీక్స్ లో ఉన్న సమయంలోనే సినిమాకు స్వస్తి పలికింది. స్వామి నిత్యానంద దరికి చేరింది. ఆయనకు ప్రియ శిష్యురాలిగా మారిపోయింది. నిత్యానంద మాయలో పడటంతో 2017లో భర్తకు విడాకులిచ్చింది. నిత్యానంద ఆశ్రమానికి తన నివాసాన్ని షిఫ్ట్ చేసిన ఆమె 2013 చివర్లో ఆనందమయిగా పేరు మార్చుకుంది. రంజితతో పాటు ఆమె సోదరి కూడా భర్తకు విడాకులిచ్చి నిత్యానందతోపాటే తిరుగుతున్నారు.
కొద్ది రోజుల తర్వాత వీరిద్దరి రాసలీలల వ్యవహారం బయటకు రావడంతో నిత్యానంద పలు వివాదాల్లో చిక్కుకున్నారు. ఆ తర్వాత దేశం విడిచి వెళ్లిపోయారు. అనంతరం ఓ ద్వీపంలో తన కొత్త జీవితాన్ని మొదలు పెట్టారు. దానికి కైలాస దేశంగా నామకరణం చేశారు. కొద్ది కాలం క్రితం ఈ దేశం తరుపున ఐక్యరాజ్య సమితి సమావేశంలో మహిళా రాయబారులు పాల్గొని సంచలనం సృష్టించారు. తర్వాత జరుగబోయే సమావేశాలకు రంజిత ప్రధాని హోదాలో వెళ్లే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అయితే వివాదాస్పద స్వామి నిత్యానంద తాను ఉంటున్న కైలాశ దేశానికి తన ప్రియశిష్యురాలు, సినీ నటి రంజితను ప్రధానమంత్రిగా ప్రకటించడాన్ని ఆయన శిష్య బృందమే వ్యతిరేకిస్తోంది. నిత్యానందకు వ్యక్తిగత సహాయకురాలిగా పనిచేసిన రంజితకు గత జూలైలో ప్రధాని పదవిని అప్పగించారు. ఆ పదవి స్వీకరించినప్పటి నుంచి రంజిత ధోరణి పూర్తిగా మారిపోయిందని తానే దేశాధ్యక్షురాలు అనే భావనతో శిష్యబృందాన్ని బెదిరిస్తూ కైలాస దేశంలోని సంస్థలను తన చెప్పుచేతుల్లోకి తెచ్చుకోవాలని కుట్ర పన్నుతోందని శిష్యులు ఆరోపిస్తున్నారు.
శిష్యులంతా ప్రధాని రంజితను వ్యతిరేకిస్తుండడం నిత్యానందకు తలనొప్పిగా మారిందని చెబుతున్నారు. ప్రధాని పదవి చేపట్టినప్పటి నుంచి రంజిత నిత్యానందతో పోటీపడేలా ఆధ్యాత్మిక ప్రసంగాలు చేస్తూ ఆ వీడియోలను కైలాస దేశం వెబ్‌సైట్‌లో పెట్టేవారు. శిష్యుల నుంచి వ్యతిరేకత రావడంతో ఆమె ఆధ్యాత్మిక ప్రసంగాల వీడియోలు ప్రసారం కూడా నిలిపేసినట్లు తెలిసింది. మూడేళ్ల క్రితం భారత దేశం నుంచి పరారైన నిత్యానంద ఈక్వెడార్ ప్రాంతంలో ఓ చిన్న దీవిని కొనుగోలు చేసుకుని దానికి ‘కైలాస దేశం’ అని పేరు పెట్టారు.
ఎన్ని ఆరోపణలు, వివాదాలు చుట్టుముట్టినా నటి రంజిత మాత్రం ఆయనను సేవించడం మానలేదు. భర్తకు విడాకులిచ్చి మరీ ఆమె నిత్యానంద ఆశ్రమంలో చేరారు. తనను అంటి పెట్టుకుని ఉన్న శిష్యురాలికి కైలాస దేశ ప్రధాని హోదాను నిత్యానంద బహుకరించారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అదే నిజమైతే ఓ దేశ ప్రధాని హెదాలో ఆమె మన దేశాన్ని కూడా సందర్శిస్తారేమో.